ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైఎస్సార్ పాలన చూస్తే తెలుస్తుందని, ఎలా ఉండకూడదో చంద్రబాబు పాలన చూస్తే తెలుస్తుందని కేవలం కమీషన్ల కోసమే పోలవరం అంచనాలు పెంచేశారని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇప్పుడు పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య పథకాలను నిర్వీర్యం చేశారని పేదవాడు వైద్యం కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లాలా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు.