చీరాల : ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఖజానా శాఖ సీనియర్ అకౌంటెంట్ అక్కేశ్వరరావు.. ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు... వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హాస్టల్ వాచ్‌మెన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన గరికా శంకర్‌రావుకు ప్రభుత్వం నుంచి రూ.1.20 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది.
అయితే వీటిని మంజూరు చేసేందుకు అక్కేశ్వరరావు రూ.15వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోమవారం చీరాలలో తహసీల్దారు కార్యాలయం ఆవరణలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో శంకర్‌రావు నుంచి రూ.5వేలు లంచం తీసుకంటుండగా అక్కేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.5వేలు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్
Published Mon, Jul 6 2015 7:12 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement