పరామర్శకు వెళ్లి మృత్యుఒడిలోకి.. లిఫ్ట్‌ రూపంలో మృత్యువు ఎదురైంది! | Woman Died After Falling Into Lift Pit At Khammam | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఆసుపత్రిలో విషాదం.. లిఫ్ట్‌ గుంతలో పడిపోయి మహిళ మృతి

Published Wed, Sep 21 2022 9:17 AM | Last Updated on Wed, Sep 21 2022 9:38 AM

Woman Died After Falling Into Lift Pit At Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని తెలంగాణ ఆసుపత్రిలో దారుణ విషాద చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం కారణంగా ఓ మహిళ మృతిచెందింది. ఆసుపత్రిలోని లిఫ్ట్‌లోపడిపోయి ఓ మహిళ చనిపోయింది. 

వివరాల ప్రకారం.. మృతురాలు ప్రమీల.. తెలంగాణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించేందుకు వెళ్లింది. పరామర్శ అనంతరం.. తిరిగి వెళ్లే క్రమంలో ప్రమీల.. ఆసుపత్రిలో ఉన్న బటన్‌ నొక్కింది. ఈ క్రమంలో లిఫ్ట్‌ కిందకు రాకుండానే డోర్‌ తెరుచుకుంది. దీంతో, లిఫ్ట్‌ వచ్చిందనుకున్న మహిళ అడుగు ముందుకు వేయగానే.. లిప్ట్‌ గుంతలో పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలు.. కంగారుపడి గట్టిగా అరిచారు. ఈ ప్రమాదంలో ప్రమీల లిఫ్ట్‌లోనే మృతిచెందింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement