ఖమ్మం ఆసుపత్రిలో శిశువు అపహరణ. | 15 days Old Infant Kidnap At Khammam Hospital | Sakshi
Sakshi News home page

ఖమ్మం ఆసుపత్రిలో శిశువు మాయం..

Published Tue, Nov 26 2019 12:13 PM | Last Updated on Tue, Nov 26 2019 2:10 PM

15 days Old Infant Kidnap At Khammam Hospital - Sakshi

సాక్షి, ఖమ్మం : ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నవ శిశువు మాయమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన రమాదేవి 15 రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. వైద్య సేవల నిమిత్తం అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్న మహిళకు ఈ రోజు ఉదయం అయిదున్నర గంటల సమయంలో తల్లికి పాలు లేకపోవడంతో పాలు ఇప్పిస్తానని నమ్మబలికి గుర్తు తెలియని మహిళ పసికందును అపహరించింది. ఎంతటికీ మహిళ తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. అనంతరం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా నిందితురాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement