బీజింగ్: కొన్ని అనుకోని ప్రమాదాలు జరిగినపుడు ఆ సమయంలో ఎవరైనా వచ్చి అంత పెద్ద ఆపద నుంచి కాపాడితే మనం ఆ ఘటనను, కాపాడిన వారిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. మన పెంపుడు జంతువులు ఒక్కొసారి తెలిసితెలియక చేసే పనుల వల్ల అవి ప్రాణాల మీదకు తెచ్చుకన్న సందర్భాలు అనేకం చూసే ఉంటాం. అచ్చం అలానే చైనాలోని ఒక కుక్క లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఎలా ప్రాణాల మీదకు తెచ్చుకుందో చూడండి.
(చదవండి: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం)
అసలు విషయంలోకి వెళ్లితే ....ఒక కుక్క తన యజమాని తో పాటు లిఫ్ట్ వెళ్లడంలో ఈ కుక్క మిస్సవుతుంది. దీంతో ఆ కుక్క కాసేపటి తర్వాత లిఫ్ట్ వచ్చి ఆగాక నెమ్మదిగా ఒక్కత్తే ఎక్కుతుంది. కానీ దాని మెడకు ఉన్న గొలుసు కొంత భాగం బయట ఉండిపోతుంది. అయితే ఆ కుక్క లోపలికి వెళ్లంగానే లిఫ్ట్ డోర్లు మూసుకుపోయి వెళ్లడం మొదలవంగానే ఆ గోలుసు లిఫ్ట్ డోర్లో ఇరక్కుపోయి ఆ కుక్క మెడకి ఉరిలా పడిపోతుంది.
అంతే అది అరుస్తూ గుంజుకుంటూ ఉంటుంది. అదే సమయం ఒక డ్రైవర్ అక్కడ ఉండటంతో ఆ కుక్కను కాపాడతాడు. అయితే ఆ గొలుసు ఇరుక్కు పోవడంతో రాదని బావించి, మెడకు గొలుసును తొలగించి రక్షిస్తాడు. ఆ తర్వాత కుక్క యజమానికి దాన్ని ఇచ్చేస్తాడు. ఈ ఘటన లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డు అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోతే కుక్కకు ఏమైదో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!)
Comments
Please login to add a commentAdd a comment