
లిఫ్ట్ డోర్ బద్ధలైన దృశ్యం
బీజింగ్ : సరదా కోసం స్పృహ మరిచి చేసే పనులు ఒక్కోసారి తెలీకుండానే ప్రాణాల మీదకు తీసుకొస్తుంటాయి. తాజాగా చైనాలోని క్సింజ్‌హెంగ్ పట్టణంలోని హెనన్ ప్రొవిన్స్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (లిఫ్ట్‌లో మూత్రం పోసి...)
స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్ కిందకు వచ్చేందుకు ఓ బాలుడు లిఫ్ట్ ఉపయోగించాడు. ఆ సమయంలో అతనితోపాటు ఓ బాలిక కూడా లిఫ్ట్‌లో ఉంది. ఉన్నట్లుండి ఆ పిల్లాడు తన కాలితో లిప్ట్ డోర్‌ను బలంగా అదిమాడు. అయితే కింది ఫ్లోర్‌కు వెళ్లాక ఒత్తిడి ఎక్కువై ఆ డోర్ కాస్త బద్ధలై ఆగిపోయింది. ఊహించని ఆ ఘటనతో ఉలిక్కిపడ్డ చిన్నారులు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న మెయింటెనెన్స్ సిబ్బంది వచ్చి వారిద్దరినీ రక్షించారు. ఇక ఆ వీడియోను వైరల్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు సూచిస్తున్నారు.
కొసమెరుపు.. లిఫ్ట్ డోర్‌ను పాడు చేసినందుకు డబ్బు చెల్లించాలని బాలుడి తల్లిని అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కోరింది. అయితే లిఫ్ట్ డోర్‌లు పాడైపోయాయని.. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని తన కొడుకు ముందే భయటపెట్టాడు కాబట్టి అంతా తన కొడుక్కి కృతజ్ఞతలు చెప్పాలని ఆ తల్లి వాదించింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ పిల్లాడి పేరెంట్స్‌దే తప్పన్న కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment