కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం వస్తే దేశ సంపదను పునఃపంపిణీ చేస్తామంటూ కాంగ్రెస్ ఇచి్చన హామీకి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు అయిన శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఈ నెల 23న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని, అలాంటి విధానం మన దేశంలోనూ అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని పరోక్షంగా సూచించారు.
‘‘అమెరికాలో వారసత్వ పన్ను చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎవరికైనా 100 మిలియన్ల డాలర్ల ఆస్తి ఉండి మరణిస్తే, ఆ ఆస్తిలో కేవలం 45 శాతమే అతడి వారసులకు చెందుతుంది. మిగిలిన 55 శాతం ఆస్తిని ప్రభుత్వం స్వా«దీనం చేసుకుంటుంది. ఇది నిజంగా ఆసక్తికరమైన చట్టం. ఆస్తులు సంపాదిస్తే సమాజంలో ఇతర ప్రజల కోసం సింహభాగం వదులుకోవాలని ఈ చట్టం చెబుతోంది.
సంపాదించిన వ్యక్తికే మొత్తం ఆస్తి చెందదు. దాదాపు సగ భాగమే అతడిది అవుతుంది. ఈ చట్టం నాకు నచ్చేస్తోంది’’ అని శామ్ పిట్రోడా పేర్కొన్నారు. వాస్తవానికి అమెరికా అంతటా వారసత్వ పన్ను చట్టం అమల్లో లేదు. కొన్ని రాష్ట్రాల్లోనే అమలవుతోంది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో శామ్ పిట్రోడా బుధవారం వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం దురదృకరమని అన్నారు. ‘గోడీ మీడియా’ వక్రభాష్యం చెబుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చెబుతున్న అబద్ధాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన వ్యాఖ్యలకు వక్రీకరించారని ఆరోపించారు. అమెరికా వారసత్వ పన్ను గురించి ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పానని వివరించారు.
మాకు ఆ ఉద్దేశం లేదు: జైరామ్
తాజా వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. దేశంలో వారసత్వ పన్ను విధించే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని బుధవారం తేలి్చచెప్పారు. నిజానికి ఇలాంటి పన్నును ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వమే గతంలో వెల్లడించిందని గుర్తుచేశారు. 1985లో ఎస్టేట్ పన్నును అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని జైరామ్ రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment