manipulate
-
ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే: పిట్రోడా
ఢిల్లీ: పోలింగ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్‌కు గురువుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్, కాంప్లెక్స్ సిస్టంల రంగాల మీద సుమారు అరవై ఎళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది.దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’’ అని అన్నారు.I have spent about 60 years in the forefront of #electronics, #telecom,IT, #software, #complex systems and a lot more. I have studied #EVM system carefully and believe that it is possible to manipulate. The best approach is the traditional paper ballet to count as casted.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 ‘పోలింగ్‌లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతో పాటు, వీవీప్యాట్ స్లిప్స్ కోసం వీవీప్యాట్ యాంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని అన్నారు.The #EVM debate in #India continues to get hotter due to a comment from #Elon Musk .The facts are clear. It is not just the stand alone EVM but a complex system with #VVPAT & associated processes and logistics that is open to selective manipulation.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్, ఓటర్లు జాబితా, వేసిన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మొత్తం ఓట్లు, విజేతలు(ఓట్లు), ఓడిపోయినవారు (ఓట్లు) వంటి వాటిపై పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించబడింది. వీటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని శ్యామ్ పిట్రోడా సూచించారు.Confusion created about #VVPAT, #voter lists, votes casted, counted, margins, winners, losers, etc. during recent #election in #India needs careful consideration to build trust between #voters and the #ECI.— Sam Pitroda (@sampitroda) June 16, 2024ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఈవీఎంలు అస్సలు హ్యాక్ చేయడాని వీలు లేదని తెలిపింది. భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి వైర్లెస్, వైర్ కనెక్షన్లు ఉండవని పేర్కొంది. దీంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా శ్యామ్ పిట్రోడా లేవనెత్తిన వీవీప్యాట్ మిషన్ల అంశంతో ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.సంబంధిత కథనం: ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? -
Odisha Train Deaths: మరణాల సంఖ్యపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు..
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య విషయమై సర్వత్రా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఒడిశా ప్రధాన కార్యదర్శి పీకే జెనా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే మీడియా ప్రతినిధులు ఎక్కువగానే ఉన్నారని, అంతా కెమెరాల సమక్షంలోనే జరుగిందని చెప్పారు. ఒడిశా పారదర్శకతనే విశ్విస్తుందని నొక్కి చెప్పారు. వాస్తవానికి రైల్వే మరణాల సంఖ్య 288గా పేర్కొంది. దీన్ని రైల్వే సమాచారం ఆధారంగా వెల్లడించింది. ఐతే బాలాసోర్ జిల్లా కలెక్టర్ ఆదివారం మరణాల సంఖ్యను 275గా ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే మరణాల సంఖ్యను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీని గురించి పీకే జెనా మృతదేహాలను రెండుసార్లు లెక్కించడం వల్ల ఇలా జరిగిందంటూ వివరణ ఇచ్చారు. అలాగే ప్రమాద స్థలంలో మీడియా వ్యక్తుల ప్రవేశంపై నిషేధం కూడా లేదని ప్రధాన కార్యదర్శి తెలిపారు. రెస్క్యూ, పునురుద్ధరణ కార్యకలాపాలు పూర్తిగా ప్రజల సమక్షంలోనే జరిగాయిని చెప్పారు. ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరణాల సంఖ్య గురించి ప్రశ్నించారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు 61 మంది మరణించారని, 182 మంది ఆచూకి తెలియలేదని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం నుంచి 182 మంది ఆచూకి తెలయలేదంటే ఆ గణాంకాలు ఎలా నిలుస్తాయి అని నిలదీశారు. ఐతే మమతా బెనర్జీ ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలను స్వీకరించేందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిరాకరించారు. కాగా, 275 మృతదేహాలలో 108 మంది మృతదేహాలను మాత్రమే గుర్తించినట్లు ప్రధాన కార్యదర్శి జెనా తెలిపారు. అలాగే మృతదేహాలను వారి కుటుంబసభ్యులు దహనం చేసేందుకు వీలుగా అన్ని మృతదేహాలను గుర్తించాలని రాష్ట్రం కోరుకుంటుందని జెనా అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం దృష్ట్యా అవి త్వరిగతిన పాడేపోతున్నాయని, అందువల్ల చట్టం ప్రకారం రాష్ట్రం గరిష్టంగా మరో రెండు రోజులు మాత్రమే వేచి చూస్తుందని చెప్పారు. (చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...) -
‘గ్యాస్ లైటర్’ తో జాగ్రత్త.. వాళ్ల మాటలు నమ్మొద్దు!
శివ, ప్రియ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రియ కాస్తంత కలుపుగోలు మనిషి. ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరిస్తుంది. కానీ శివకు అది నచ్చదు. ముఖ్యంగా మగవాళ్లతో మాట్లాడటం అస్సలు నచ్చదు. ఆ విషయమై తరచూ ప్రియపై కోప్పడుతుంటాడు. ‘‘నీకు ఎప్పుడూ వేరే వాళ్లతో మాట్లాడటమే ఇష్టం. నాతో మాట్లాడాలంటే కష్టం. నీ కంటికి నేనే చేతకానివాణ్ని. అంతేగా?’’ అంటూ తరచూ గొడవపడేవాడు. ‘‘నేనెంత చెప్పినా, బ్రతిమాలుకున్నా నీ ప్రవర్తనలో మార్పు లేదంటే నీకు ఎలాంటి మానసిక సమస్య ఉందో అర్థం చేసుకో’’ అని హెచ్చరించేవాడు. మొదట్లో ప్రియ అతని మాటలు పట్టించుకోలేదు. కానీ కాలక్రమేణా ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. ‘‘శివ మాటలు నిజమేనేమో? నాకు నిజంగా మానసిక సమస్యలు ఉన్నాయేమో? లేకుంటే పదే పదే ఎందుకు అంటాడు?’’ అని అయోమయానికి గురవుతోంది. గ్యాస్ లైట్ గురించి అందరికీ తెలుసుకదా... గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ఉపయోగించేది. అలాగే శివలాంటి వ్యక్తులు వ్యక్తులు తమ మాటలు, ప్రవర్తన ద్వారా మరో వ్యక్తి భావోద్వేగాలను రెచ్చగొట్టి వారిపై అదుపు సాధిస్తుంటారు. దీన్నే ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఈ పని చేసేవాళ్లను ‘గ్యాస్ లైటర్’ అంటారు. వీళ్లు ఇతరులపై నియంత్రణ సాధించేందుకు ప్రమాదకరమైన మైండ్ గేమ్‌లు ఆడతారు. అబద్ధాలు చెప్తారు, సమాచారాన్ని దాచిపెడతారు, నిందలు వేస్తారు, రకరకాల కథలు చెప్పి మేనిప్యులేట్ చేసి తనపై తాను నమ్మకం కోల్పోయేలా చేస్తారు. చివరకు నియంత్రణ సాధిస్తారు. మీ చుట్టూనే ఉంటారు... సహోద్యోగిని ఉద్యోగం నుండి తొలగించాలని యజమానిని ఒప్పించే వ్యక్తి, తోడికోడలిని హింసించాలని అత్తను ఎగదోసే కోడలు, నిత్యం భార్యను తప్పుపడుతూ చిన్నబుచ్చే భర్త... ఇలాంటి వారంతా గ్యాస్ లైటర్లే. నిరంతరంగా విమర్శించడం, నిందించడం, దుర్భాషలాడడం, భయపెట్టడం, బాధ్యతను తిరస్కరించడం, బంధంపై అసంతృప్తిని ప్రకటించడం... వారి ప్రాథమిక వ్యూహాలు. మీ ప్రతి ప్రవర్తనపై తీర్పులనిస్తూ మిమ్మల్ని అంతులేని అమోమయానికి, మిమ్మల్ని మీరే అనుమానించే స్థితికి తీసుకువస్తారు. మీరేదో తప్పు చేస్తున్నారని మీరే అంగీకరించేలా చేస్తారు. మీ చుట్టూ ఇలాంటి వారెవరైనా ఉన్నారేమో గమనించండి. ఆధిపత్యం కోసమే... గ్యాస్ లైటింగ్ అనేది ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాట నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి ఇలా ప్రవర్తిస్తుంటారు. ఏదో విధంగా తమ తప్పును కూడా పక్కవారిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటుంటారు. ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు గ్యాస్‌లైటింగ్‌కు దారితీస్తాయి. ఈ డిజార్డర్స్ ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ తప్పును అంగీకరించరు. మీపై మీరు నమ్మకం కోల్పోతారు... గ్యాస్‌లైటింగ్ మీపై మీరు నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. మీలో ఏదో తప్పు ఉందని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. ఎవరినీ త్వరగా విశ్వసించలేరు. ఎవరి సహాయమూ తీసుకోలేరు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా నమ్మలేరు. నిరాశ, ఆందోళన, దీర్ఘకాలిక ఒత్తిడి, తీవ్రమైన మానసిక క్షోభకు కారణమవుతుంది. ఇది ఆ ప్రభావం నుంచి బయటపడ్డాక కూడా చాలాకాలం పాటు కొనసాగుతుంది. గ్యాస్ లైటర్లు తరచూవాడే వ్యాఖ్యాలు.. నేను నీ కోసమే అలా చేశాను. నేను నీకోసం అంత చేస్తే నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. అందుకే నీకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు. మనం దీని గురించి గతంలో మాట్లాడుకున్నాం... నీకు గుర్తులేదా? అలా జరగలేదు. నువ్వే ఊహించుకుంటున్నావు. నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు తెలుసా? నువ్వెప్పుడూ ఇంతే.. మూడంతా చెడగొడతావు. నువ్వేం శుద్దపూసవు కాదులే. ఆ విషయం నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ల మాటలు నమ్మొద్దు గ్యాస్ లైటర్లు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టండి. "మీకు పిచ్చి" అని నిరంతరం చెప్పి మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. మీరు వాదించేకొద్దీ... మీ మాటలను మీపైనే ప్రయోగిస్తారు. కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. మీరు తప్పుగా గుర్తుంచుకుంటున్నారని లేదా మానసిక సమస్యలో ఉన్నారని తరచూ కథలు చెప్తుంటారు. ఆ మాటలను నమ్మకండి. వాళ్లు చెప్పే కథలకన్నా మీ జాపకాలపైనే నమ్మకం ఉంచండి. గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలను కూడా పట్టించుకోవద్దు. గ్యాస్ లైటర్‌తో మీ బంధం లేదా అనుబంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించండి. మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి బంధం నుంచి బయటకు వచ్చేయండి. చదవండి: మానవ సంబంధాలపై ‘గ్యాస్ లైటింగ్’! -
భూతవైద్యుడి బాగోతం.. దయ్యం పట్టిందని చెప్పి..
సాక్షి, ఏటూరునాగారం(వరంగల్): ఆరోగ్యం బాగోలేకపోవడంతో దయ్యం పట్టిందని వైద్యం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రూ.16,500 నగదు, రెండు తులాల పుస్తెలతాడు తీసుకొని ఓ ప్రబుద్దుడు పరారైన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండగొర్ల రమేష్, ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రాధిక, రవళి, రమ్య ఉన్నారు. అందులో చిన్న కు మార్తెకు కడుపులో నొప్పి ఉండడంతో గత ఏడాది శ స్త్ర చికిత్స చేయించారు. అయితే వారి ఇంటి ముందుకు బైక్‌పై ఓ భూతవైద్యుడు వచ్చి మీ ఇంటిలో ఒ కరి ఆరోగ్యం బాగులేదు, కొన్ని మంత్రాలతో న యం చేస్తానని మాయమాటలు చెప్పాడు. భూతవైధ్యానికి సంబంధించిన వస్తువులను తెప్పించుకున్నా రు. నగదు రూ.16,500, బంగారు ఆభరణం కావా లని చెప్పడంతో నమ్మిన రమేష్ భార్య నగదుతోపా టు తన మెడలోని రెండు తులాల పుస్తెలతాడును అతడికి ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఏదో పూజ చేస్తున్నట్లు నాటకమాడి రమేష్ దంపతులను కల్లుమూసుకొని చెప్పి అక్కడి నుంచి బైక్‌పై పరారు అయ్యా డు. ఇక తాము మోసపోయామని గుర్తించి లబోది బోమన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయకపోవడం బాధాకరమని స్థానికులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. -
మన కమిటీ.. మన నివేదిక!
సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదు అనే సామెత అక్షరాలా సరిపోతుంది దుర్గగుడి వ్యవహారంలో. వివాదం ఏదైనా కమిటీ వేసేది మనమే.. వచ్చే నివేదిక మనకు అనుకూలంగానే అన్న చందంగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. నిజనిర్థరణ కమిటీని వేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇందుకోసం ముందుగానే తాంత్రిక పూజలు జరగలేదని నిజనిర్థారణ కమిటీతో చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, కీలక నిందితుడు పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు. ఈ విచారణలో కొంత మంది తాంత్రిక పూజలు జరిగాయని నిర్థారించి చెప్పగా, మరికొంత మంది అర్చకులు కూడా తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవేమని అభిప్రాయ పడ్డారు. అయితే ఆలయ అధికారులు, అర్చకులు విచారణలో చెప్పిన మాటలను కమిటీ పరిగణలోకి తీసుకోకుండా నివేదిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల ఒత్తిడికి లోబడి నివేదిక రూపుదిద్దకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు, నివేదికను ఎలా రూపొందించాలి అనే విషయంపై నిజనిర్థారణ కమిటీతో పలుపార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా తాంత్రిక పూజలు జరగలేదనే విధంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. నిజ నిర్ధారణ కమిటీ తీరుపై హిందూ ధర్మకర్తలు, పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాలను వెల్లడించాల్సిన కమిటీ ప్రభుత్వం ఒత్తుడులకు లోబడి పనిచేసిందని విమర్శించారు. దుర్గాదేవి, మహిషాసురమర్దిని అవతారాలు ఒక్కటేనని మీరు ఎలా నిర్ణయిస్తారంటూ కమిటీ సభ్యులపై స్వామీజీలు మండిపడ్డారు. -
తిందాం.. మెదడును మాయ చేద్దాం..
షుగరుంది.. కానీ స్వీట్స్ తినడమంటే ఇష్టం.. ఎలా? బీపీ ఉంది.. ఉప్పు తగ్గితే ఒప్పుకోం.. మసాలాలంటే మరీ ఇష్టం.. మరెలా? ఊబకాయమూ ఉంది.. ఐస్‌క్రీములు, పిజ్జా, బర్గర్లు అంటే ప్రాణం.. ఇంకెలా? ఇలాంటివెన్నో సమస్యలకు పరిష్కారం ఈ ‘సెట్ టు మిమిక్’ అంటున్నారు ఈ డిజైన్ రూపకర్త రొమేనియాకు చెందిన సొరీనా రస్తీను. చెడు ఆహారపు అలవాట్లకు, ఫుడ్ అలర్జీలకూ చెక్ పెడుతుందని చెబుతున్నారు. అసలు ఏంటిది: ఇదో అత్యాధునికమైన కిచెన్వేర్. ఇందులో ప్లేటు, గ్లాసుతోపాటు పారదర్శకంగా ఉండే చిన్నపాటి ప్యాచ్లాంటిది ఉంటుంది. మైక్రోచిప్ ఉండే ఆ ప్యాచ్‌ను మన బుర్రకు అంటించుకోవాలి. ప్లేటు, గ్లాసులో ఉన్న సెన్స ర్లు ఆ ప్యాచ్‌తో అనుసంధానమై ఉంటాయి. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. మీరా ప్లేటులో యాపిల్ పెట్టుకుని తింటున్నా.. మీకిష్టమైన ఐస్ క్రీం తింటున్న అనుభూతి కలుగుతుంది. వాసన కూడా అలాగే వస్తుంది. దీని వల్ల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనం సాధ్యపడుతుందని చెబుతున్నారు. ఎలా పనిచేస్తుంది: ఈ గ్లాసు, ప్లేటులో డిటెక్టర్ బ్యాండ్స్ ఉంటాయి. ఉదాహరణకు.. మీరు ప్లేటులో యాపిల్ పెట్టినా.. గ్లాసులో జ్యూస్ వేసినా.. దాన్ని గుర్తించి, స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యేలా చేస్తాయి. ఇప్పుడే అసలైన పని. మనకు బటర్ చికెన్ తినాలని ఉంది. కానీ ప్లేటులో యాపిల్ ఉంది. అప్పుడు మనమేం చేయాలంటే.. ఇందులో ఉండే ఆహార పదార్థాల జాబితా నుంచి చికెన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ప్యాచ్‌ను తలకు అంటించుకోవాలి. అవి మెదడులోని కణాలను ‘చికెన్’కు తగ్గట్లు ట్యూన్ చేస్తాయి. దీని వల్ల యాపిల్ తింటుంటే.. బటర్ చికెన్ తిన్న అనుభూతి మన మెదడుకు కలుగుతుంది. ‘జంక్ ఫుడ్ వంటివి నష్టం చేస్తాయన్న సంగతి మనకు తెలుసు. అయితే.. వాటి రుచి, వాసన కోసం తింటున్నారు. మెదడు వల్లే మనకవి తెలుస్తున్నాయి. అలాంటప్పుడు నేరుగా మెదడునే మాయ చేస్తే.. మనం జంక్ ఫుడ్‌ను తినకుండా.. దానికి ఆ అనుభూతిని కలుగజేస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచనతోనే దీన్ని డిజైన్ చేశాం’ అని సొరీనా చెప్పారు. ఈ డిజైన్ ఇంత వినూత్నంగా ఉంది కాబట్టే.. ఎలక్ట్రోలక్స్ సంస్థ ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక డిజైన్ ల్యాబ్-2014 పురస్కారం టాప్-6 ఫైనలిస్టుల జాబితాకు ఇదీ ఎంపికైంది. మరో రెండ్రోజుల్లో విజేతను ప్రకటించనున్నారు.