భారత క్రికెటర్‌కు షాక్‌ | Cricketer Mohammed Siraj Facebook account hacked | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ సిరాజ్‌ ఫేస్‌బుక్‌ హ్యాక్‌

Published Wed, Jan 24 2018 8:54 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

Cricketer Mohammed Siraj Facebook account hacked - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌ జట్టుకు సెలెక్ట్‌ అయిన హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణా మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ కావడంపై ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలోని బృందం కొన్ని గంటల్లోనే బాధ్యుడిని గుర్తించింది. అతడు సిరాజ్‌కు పరిచయస్తుడే కావడంతో కేసు వద్దని చెప్పిన ఆయన ఫిర్యాదు ఉపసంహరించుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు క్రికెటర్‌ సిరాజ్‌ ఎంపికయ్యాడు. యువ క్రికెటర్‌ కావడంతో ఈయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్‌ ఫాలోయింగ్‌ ఉంది.

ఇందులో భాగంగానే ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఆ బాలుడు క్రికెటర్‌ కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో తేలిగ్గా సిరాజ్‌ ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఖాతాలోకి ప్రవేశించిన బాలుడు దాని నుంచి ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న కొందరికి సందేశాలు పంపాడు. ఈ విషయం గుర్తించిన సిరాజ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయిందంటూ మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడే హ్యాకర్‌ అని గుర్తించిన అధికారులు విషయం సిరాజ్‌కు వివరించారు. అతడు తన కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో కేసు వద్దని పోలీసులకు చెప్పిన సిరాజ్‌ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement