మీకు అమ్మ, అక్కాచెల్లెళ్లు లేరా.. | Anupama Parameswaran Declared Her Facebook Account Was Hacked | Sakshi
Sakshi News home page

ఎవరో వెధవలు నా ఫేస్‌బుక్‌ హ్యాక్‌ చేశారు: అనుపమ

Published Mon, Apr 13 2020 3:58 PM | Last Updated on Mon, Apr 13 2020 4:35 PM

Anupama Parameswaran Declared Her Facebook Account Was Hacked - Sakshi

తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారంటూ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మండిపడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో నటించిన ఈ కేరళ కుట్టి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ల జాబితాలో చేరారు. ఇక అనుపమ సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరనే విషయం అందరికి తెలిసినదే. ఎప్పుడూ దక్షిణ సంప్రాదాయ దుస్తుల్లో ఉండే అనుపమ ఈ మధ్య కాస్తా జీన్స్‌, టిషర్ట్స్‌ ధరించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేగాక ఫేస్‌బుక్‌లో తరచూ ఫొటోలు షేర్‌ చేస్తూ.. ఈ భామ కాస్తా యాక్టివ్‌గా ఉండటం చూసి ఆమె అభిమానులు షాకవుతున్నారు. ఎప్పుడూ చీరలో, చుడీదార్‌ వంటి సంప్రాదాయ దుస్తుల్లో మెరిసే తమ అభిమాన హీరోయిన్‌ను.. ఇలా వెస్టర్న్‌ వేర్‌లో చూసి అభిమానుల్లో కొంతమంది మండిపడుతుంటే.. మరికొందరు బాగుందంటూ మురిసిపోతున్నారు. (కన్నడంలో నిన్ను కోరి)

ఇక ఈ ఫొటోలు చూసిన అనుపమ .. ఈ పోస్టులు తను చేసినవి కాదని, తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని పేర్కొన్నారు. ‘కొంత మంది వెధవలు నా ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేశారు. కాస్తా అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇస్తున్నా అంతే’ అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. దీనికి తన ఫేస్‌తో మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను ట్యాగ్‌ చేసి పోస్టు చేశారు. ఇక ఇలాంటి వెధవ పనులు చేసే హ్యాకర్స్‌పై ఆమె విరుచుకుపడ్డారు.

‘’మీకు ఇంట్లో అమ్మ, అక్కాచెల్లెళ్లు లేరా. మీ మెదడును కొంచం ఉపయోగపడే మంచి పనులకు వాడండి. ఇలాంటి చెత్త పనులకు కాదు’’  అంటూ మండిపడ్డారు. ఇక అనుపమకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6.6 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. కాగా ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన రాక్షసుడులో హీరోయిన్‌గా నటించారు. 2015లో వచ్చిన మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో పాపులర్‌ అయిన ఈ భామ.. గతేడాది హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌తో కలిసి ‘నటసార్వభౌమ’ చిత్రంతో కన్నడలో ఆరంగేట్రం చేశారు. (నేను ఆ రకం కాదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement