
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) హ్యాకింగ్ కేసు విచారణ సీబీఐ వద్దకు చేరింది. ఇప్పటిదాకా ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేయగా.. తాజాగా దీన్ని సీబీఐ టేకోవర్ చేసింది. 2016 జులై 20న జరిగిన ఈ సైబర్ దాడిలో హ్యాకర్లు 171 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,200 కోట్లు) నిధులను బ్యాంకు నోస్ట్రో అకౌంటు నుంచి వివిధ దేశాల్లోని ఖాతాల్లోకి మళ్లించారు. యూబీఐ నోస్ట్రో అకౌంట్లను నిర్వహించే రెండు అమెరికన్ బ్యాంకుల ద్వారా కాంబోడియా, థాయ్‌ల్యాండ్, తైవాన్, ఆస్ట్రేలియా దేశాల్లోని ఖాతాలకు నిధుల మళ్లింపు జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment