యూనియన్‌ బ్యాంకుకు రూ.74 కోట్ల టోకరా | CBI registers fraud cases worth Rs 74 crore in Union Bank of India | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంకుకు రూ.74 కోట్ల టోకరా

Published Sat, Dec 29 2018 5:13 PM | Last Updated on Sat, Dec 29 2018 6:15 PM

CBI registers fraud cases worth Rs 74 crore in Union Bank of India - Sakshi

సాక్షి, ముంబై: 2018 సంవత్సరం  ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో మూడు స్కాంలు, ఆరు మోసాలు అన్నట్టు  గడిచింది. మరో రెండురోజుల్లో ఏడాది ముగియనుండగా తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో మరో  మోసం వెలుగు  చూసింది. ఈ కేసులో సీబీఐ నాలుగు వేర్వేరు కేసులను నమోదు చేసింది. 

యూనియ‌న్ బ్యాంక్ ఫిర్యాదు మేర‌కు సీబీఐ ఈ కేసును న‌మోదు చేసింది. 74 కోట్ల రూపాయల మేర డిఫాల్టర్లు బ్యాంకును మోసగించారని తెలిపింది. కౌశాంబి, ఘజియాబాద్‌లోని కార్పొరేట్‌ బ్రాంచ్‌లలో ఈ మోసం చోటు చేసుకున్నట్టు సీబీఐ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎస్ఎం ఎంటర్ప్రైజెస్, జీనియస్ ఇంపెక్స్, జెబిఆర్ ఇంపెక్స్, జె.ఆర్ ఫుడ్స్ కంపెనీలు డిఫాల్టర్లుగా తేలారని యూనియన్‌ బ్యాంక్‌ రిపోర్టు చేసింది. ఈ మొండి బకాయిలుపై విచారణ చేపట్టాలని సీబీఐని  కోరింది. దీంతో ఈ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై కూడా సీబీఐ  కేసు నమోదు చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement