
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో సర్వర్లు హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు యత్నించినట్లు సమాచారం.ఈ విషయంపై తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ)హెచ్చరించింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వెల్లడించింది.ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని బ్లాకింగ్ సర్వర్స్, కంట్రోల్ పంక్షన్స్ ని గమనిస్తూ ఉండలని సీఈఆర్టీ సూచించింది. దీంతో తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.. విద్యుత్ శాఖ వెబ్ సైట్ లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను మార్చేసింది.ఇక, చైనా హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment