CERT
-
గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్
న్యూఢిల్లీ: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్-200 టాప్-10 దేశాల్లో భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ రూపొందించిన ఈ జాబితాలో భారత్ 10వ ర్యాంక్‌ను చేజిక్కించుకుంది. 37 స్థానాలు మెరుగుపడి ఈ ర్యాంక్‌ను దక్కించుకోవడం విశేషం. 2019లో 47వ స్థానానికి పరిమితమైన భారత్ ఈ అంశంలో తాజాగా తన ర్యాంకును మరింతగా మెరుగుపరుచుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంత పరంగా నాల్గవ ర్యాంక్ సాధించింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో చట్టపరమైన, సాంకేతిక, సంస్థాగత చర్యలు, సామర్థ్యం అభివృద్ధి, సహకారం ఆధారంగా ఇండెక్స్ రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్ పరంగా భారత్ టాప్ 10లో ఉంటే మన శత్రు దేశాలు చైనా 33వ స్థానంలో, పాకిస్తాన్ 79వ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటీయు), గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఎజెండా(జీసీఏ) జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో యుకె ఉంది. "ఇది గొప్ప వార్త సీఈఆర్టీ(సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్)తో పాటు మేము తీసుకున్న చర్యలకు ఇది నిదర్శనం' అని భారత జాతీయ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్(ఎన్ సీఎస్సీ) రాజేష్ పంత్ అన్నారు. చదవండి: సెప్టెంబర్ నుంచి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్ డెలివరీలు -
తెలంగాణ విద్యుత్‌శాఖకు సీఈఆర్టీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో సర్వర్లు హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు యత్నించినట్లు సమాచారం.ఈ విషయంపై తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)హెచ్చరించింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వెల్లడించింది.ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని బ్లాకింగ్ సర్వర్స్, కంట్రోల్ పంక్షన్స్ ని గమనిస్తూ ఉండలని సీఈఆర్టీ సూచించింది. దీంతో తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది.. విద్యుత్ శాఖ వెబ్ సైట్ లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను మార్చేసింది.ఇక, చైనా హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. -
వాట్సాప్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. అయితే సాఫ్ట్వేర్ లోపంతో కలిగే ప్రభావం వినియోగదారులపై పడలేదని వాట్సాప్ చెబుతోంది. వందలాది మంది భారతీయ వినియోగదారులపై ఇజ్రాయెల్‌కు చెందిన ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్వేర్ సాయంతో గుర్తుతెలియని సంస్థలు నిఘా పెట్టాయని వాట్సాప్ ఇటీవల భారతసర్కారుకు తెలిపిన నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. హ్యాకింగ్, ఫిషింగ్ తదితర సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం సీఈఆర్టీని నోడల్ సంస్థగా ఏర్పాటు చేయడం తెల్సిందే. సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం మేలని సీఈఆర్టీ సూచించింది. విచారం వ్యక్తంచేసిన వాట్సాప్ పెగాసస్ నిఘా అంశంపై విచారం వ్యక్తంచేస్తూ భారత సర్కార్‌కు వాట్సాప్ లేఖ రాసింది. నిఘా వ్యవహారంపై అప్రమత్తంగా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీనిస్తున్న లేఖలో పేర్కొంది. వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టంచేయాలని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే సహించేదిలేదని ప్రభుత్వం వాట్సాప్‌ను మందలించిందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చర్చ నిఘా అంశాన్ని చర్చించాలా వద్దా అన్న దానిపైనా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. రెండు గంటలపాటు చర్చించినా దీనిపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. చర్చ అవసరంలేదని బీజేపీ సభ్యులు అభిప్రాయపడగా, లోక్‌జనశక్తి, వైఎస్సార్సీపీలు చర్చవైపునకు మొగ్గుచూపాయి. దీంతో ఓటింగ్‌కు వెళ్లారు. చర్చకు సరేనంటూ, కాదంటూ సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో కమిటీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత శశిథరూర్.. చర్చించేందుకే ఓటేయడంతో సభ్యులు ఈ అంశాన్ని చర్చకు స్వీకరించారు. -
'ఉడ్తా పంజాబ్' ఎఫెక్ట్; 179 లింక్స్ బ్లాక్
ముంబై: 'ఉడ్తా పంజాబ్' ఆన్లైన్ లో లీక్ పై ఫిర్యాదు అందించిన 24 గంటల్లో ముంబై పోలీసులు స్పందించారు. ఆన్లైన్ లో ఈ సినిమాకు సంబంధించిన 179 లింకులు బ్లాక్ చేశారు. మరో 500 లింకులను బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్) సహాయంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. విడుదలకు ముందే బుధవారం మధ్యాహ్నం 'ఉడ్తా పంజాబ్'ను ఆన్లైన్ లో లీక్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు గురువారం కోర్టును ఆశ్రయించారు. తమ సినిమాను ఆన్లైన్ పెట్టిన వెబ్సైట్లను నిలిపివేసేలా ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇంటర్నెట్ డొమైన్లు, 500పైగా ఇంటర్నెట్ యూఆర్ఎల్స్ ను కోర్టుకు సమర్పించారు. 'ఉడ్తా పంజాబ్' ఆన్లైన్ లో ఎవరు లీక్ చేశారో కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, సెన్సార్ వివాదాలను దాటుకుని శుక్రవారం ఈ సినిమా ధియేటర్లలో విడుదలైంది.