
ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్‌కు ఆది నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడి నోట వచ్చే మాస్ డైలాగులపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. ఈ డైలాగులు జనాలకు కనెక్ట్ అవుతాయనుకుంటే రివర్స్ అయిందేంటని నాలుక్కరుచుకున్న చిత్రయూనిట్ వెంటనే తప్పును సరిదిద్దుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ డైలాగులు కూడా సినిమాపై నెగెటివిటీ పెరిగేందుకు దోహదపడ్డాయి.
అయితే ఆ డైలాగులు తనకు కూడా నచ్చలేదంటున్నాడు ఆదిపురుష్ నటుడు లావ్ పజ్నీ. సినిమాలో కుంభకర్ణుడిగా నటించిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మనం డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. సినిమాను కొద్దికొద్ది భాగాలుగా చిత్రీకరిస్తూ పోయారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. సినిమాలోని వివాదాస్పద సంభాషణలు తొలగించినప్పటికీ.. ఒక హిందువుగా ఆ డైలాగులు విని నేను కూడా ఆవేదన చెందాను' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: పెళ్లికి ముందే ప్రియుడి ఇంటికి నటి.. వేణుమాధవ్‌తో రిలేషన్ ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment