నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్ | Kriti Sanon Interesting Comments On Her Dream Life Husband Qualities, Deets Inside | Sakshi
Sakshi News home page

Kriti Sanon: కాబోయే భర్త అలా ఉండాలి.. కానీ ఆ కోరిక మాత్రం!

Published Sat, May 11 2024 9:20 PM | Last Updated on Sun, May 12 2024 7:32 PM

Kriti Sanon Comments On Her Husband Qualities

ఒంటరిగా ఉన్న హీరోయిన్లు చాలామంది గత కొన్నాళ్లలో పెళ్లి చేసేసుకుంటున్నారు. ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మరికొందరు అందుకు తగ్గ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు కృతి సనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాబోయే భర్త ఎలా ఉండాలో హింట్స్ కూడా ఇచ్చేస్తోంది. ఈ మధ్య ఈమె లండన్‌కి చెందిన కబీర్ బహియాతో అనే వ్యాపారవేత్తతో కలిసి కనిపించడంతో ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్)

'ఏ విషయంలోనైనా మనం ఆశ పెట్టుకుంటే ఒత్తిడితో ఇబ్బంది పడతాం. అందుకే నేను ఎలాంటి ఆశ పెట్టుకోను. ఏం జరిగినా సరే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఇకపోతే నాకు కాబోయే భర్త నాతో నిజాయతీగా ఉండాలి. నన్ను నవ్వించాలి. నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైమ్ గడపాలి. అన్నింటికి ముఖ్యమైంది నన్ను బాగా చూసుకోవాలి. అలా అని నాతో సరితూగాలనే కోరిక అయితే లేదు' అని కృతి సనన్.. కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది.

కృతి చెప్పిన దానిబట్టి చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేలా కనిపిస్తుంది. మరి లండన్ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేస్తుందా? లేదంటే ఈమె మనసులో మరెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ రావాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. 'ది క్రూ' మూవీతో ఈ మధ్య హిట్ కొట్టింది. ప్రస్తుతం హీరోయిన్ కమ్ నిర్మాతగా 'దో పత్తీ' మూవీ చేస్తోంది. 

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement