ప్రభాస్‌తో ఔెం రౌత్ తెరక్కించిన 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణడి పాత్రలన్ని కూడా పాపులర్ అయిన నటులే పోషించారు. కానీ రామ-రావణ యుద్ధానికి కారణమైన రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటించిన తేజస్విని పండిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
(ఇదీ చదవండి: Niharika Reaction: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక)
ఆమె చేసింది రాక్షసి పాత్రే అయినా.. అందాల రాక్షసిగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 2004లో ఎంట్రీ ఇచ్చి మరాఠిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి ప్రస్థుతం అక్కడ పెద్దగా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. పలు సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లోనూ ఆకట్టుకుంది. పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కానీ టాలెంట్ ఉన్నా కూడా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు.
(ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి ఈ పేరు పెట్టాం: కాజల్)
అయితే తేజస్విని పండిట్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే తన చిన్ననాటి స్నేహితుడైనా భూషణ్ బోప్చేను 2012లో వివాహం చేసుకుంది. వారి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా అమె కుటుంబ విషయాల గురించి తెలుపుతూ.. ఒకానొక సమయంలో తినడానికి కూడా తిండి లేదని ఎమోషనల్ అయింది.
తన ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు... కానీ అప్పులు మాత్రం ఇంటి నిండా ఉండేవి అని తెలిపింది. ఇప్పుడు ఆ జీవితాన్ని తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని పేర్కొంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తేజస్విని పండిట్.. తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. అక్కడ తనకు ఓక మిలియన్‌కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment