సినిమా రంగంలో రాణించడానికి ప్రతిభ ఉంటే చాలదు. కృషి, శ్రమ, అన్నింటికీ మించి అదృష్టం చాలా ముఖ్యం. అయినా ఒక్కోమెట్టు ఎక్కాలంటే ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్ నటి కృతిసనన్ ఇలాంటి అవమానాలను ఎదుర్కొందట. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంతకుముందే తెలుగులో మహేష్‌బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది.
(ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ)
ఇటీవల ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కృతిసనన్‌కు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఈమె హిందీలో నటించిన 'మిమి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. అలాంటి నటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తొలి రోజులను గుర్తు చేసుకుంది.
మొదట్లో మోడల్‌గా చేస్తూనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పింది. ఇందుకు చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది. 'చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక డాన్స్ సన్నివేశంలో నేను పొరపాటు చేయడం వల్ల నృత్య దర్శకుడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఒక ఫామ్‌హౌస్‌లో షూట్. ఆ ప్రాంతమంతా గడ్డితో పాటు తేమగా ఉంది. అందువల్ల నా హీల్స్ ఆ గడ్డిలో చిక్కుకుపోయాయి. డ్యాన్స్‌లో సరైన మూమెంట్ రాలేదు. దీంతో డ్యాన్స్ మాస్టర్ ఫైర్ కావడమే కాకుండా చెత్తగా మాట్లాడాడు. ఆ సమయంలో సుమారు 50 మంది మోడల్స్ అక్కడ ఉన్నారు. అలాగని తాను వెనుకడుగు వేయలేదు.' అని నటిగా తన పయనాన్ని పట్టుదలతో కొనసాగించానని పేర్కొంది. ఆ తరువాత ఆ డానన్స్ మాస్టర్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment