విషాదం.. ‘ఆదిపురుష్‌’ నటి కన్నుమూత | Veteran Actress Asha Sharma Passed Away | Sakshi
Sakshi News home page

విషాదం.. ‘ఆదిపురుష్‌’ నటి కన్నుమూత

Published Sun, Aug 25 2024 5:54 PM | Last Updated on Sun, Aug 25 2024 6:13 PM

Veteran Actress Asha Sharma Passed Away

చిత్ర పరిశ్రమలో విషాదం చేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశా..ఆదివారం ఉదయం తుదిశ్వాస విడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 13 ఏళ్ల వయసులోనే వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది ఆశా శర్మ. ఆ తర్వాత నటిగా మారింది. 1920, హమ్‌కో తుమ్సే ప్యార్ హై, హమ్ తుమ్హారే హై సనమ్‌తో పాటు మొత్తం 40 పైగా సినిమాల్లో నటించింది. 

ధర్మేంద్ర, హేమమాలిని మూవీ ‘దో దిశాయీన్‌’ మూవీలోనూ అద్భుత నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆశాతో పాటు ప్రేమ్ చోప్రా, అరుణా ఇరానీ, నిరుపా రాయ్‌తో పాటు పలువురు నటించారు. చివరగా ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమాలో శబరి పాత్రను పోషించింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘కుంకుమ్ భాగ్య’, ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘ఏక్ ఔర్ మహాభారత్’ లాంటి సీరియల్స్‌తో కీలక పాత్రలు పోషించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement