Devdatta Gajanan Nage Diet, Fitness And Workout Routine - Sakshi
Sakshi News home page

‘ఆది పురుష్‌’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!

Published Thu, Jun 22 2023 8:57 AM | Last Updated on Thu, Jun 22 2023 10:03 AM

Devdatta Gajanan Nage Diet Fitness Workout Routine - Sakshi

హీరో ‍ప్రభాస్‌ నటించిన ‘ఆది పురుష్‌’ సినిమా చిత్రీకరించిన తీరుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని హనుమంతుని క్యారెక్టర్‌, అతని డైలాగ్స్‌పై విమర్శలు చుట్టుముట్టిన నేపధ్యంలో చిత్ర యూనిట్‌ ఆ డైలాగ్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ‘ఆది పురుష్‌’ సినిమాలోని హనుమంతుని పాత్రను దేవదత్త నాగె పోషించారు. 

మరాఠీ నటుడైన దేవదత్త నాగె దీనికిముందు ‘తాన్హాజీ’ సినిమాలో నటించారు. అలాగే ‘వీర్‌ శివాజీ’, ‘బాజీరావ్‌ మస్తానీ’ తదితర ప్రముఖ సీరియల్స్‌లో నటించారు. మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ముంబైలో తన భార్య కంచన్‌ నాగెతో పాటు ఉంటున్నారు. దేవదత్త నాగె వయసు 41. ఆయన 2013లో ‘వన్స్‌ అపాన్‌ ఆ టైమ్‌ ఇన్‌ ముంబై దోబారా’ సినిమాతో బాలీవుడ్‌లో కాలుమోపారు. 

‘ఆది పురుష్‌’ సినిమా గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు హనుమంతునితో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. తనకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తొలిసారి జిమ్‌కు వెళ్లానని,ఆ జిమ్‌ పేరు హనుమాన్‌ వ్యాయామశాల అని అన్నారు. హనుమంతుని ఆశీర్వాదంతోనే సినిమాలో ఈ పాత్ర పోషించానని తెలిపారు. ఈ పాత్రను తాను భక్తిలో లీనమై చేశానని అన్నారు. 

దేవదత్త సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 25 వేలకు మించిన ఫాలోవర్స్‌ ఉన్నారు. దేవదత్త సోషల్‌ మీడియాలో తరచూ తన ఫొటోలను షేర్‌ చేస్తుంటారు. రోజూ తగిన రీతిలో వ్యాయామం చేయడమే తన బాడీ బిల్డింగ్‌ సీక్రెట్‌ అని దేవదత్త తెలిపారు. 

ఇది కూడా చదవండి: భారీగా తగ్గిన ఆదిపురుష్‌ టిక్కెట్ల ధరలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement