సినిమా జయాపజయాలను ముందుగా ఊహించడం కష్టం. ఫలానా కథతో సినిమా తీస్తే ఆడుతుంది, ఫలానా కథతో సినిమా తీస్తే ఆడదు అని ముందే పసిగడితే ఇండస్ట్రీలో ఫ్లాపులెందుకు ఉంటాయి? అలా అని తీసుకున్న కథ ఒక్కటి బాగుంటే సరిపోదు.. దాన్ని తెరకెక్కించే విధానం, ప్రేక్షకులను ఆకర్షించేలా తీర్చిదిద్దగలిగే టాలెంట్ ఉండాలి. ఇది లేకపోవడం వల్లే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ అతి ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది.
ఏడు నెలల తర్వాత పెదవి విప్పిన నటుడు
గతేడాది జూన్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్లాప్ టాక్ రావడంతో ఎవరూ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారి ఈ సినిమా ఫెయిల్యూర్‌పై స్పందించాడు సైఫ్ అలీ ఖాన్. ఇతడు ఆదిపురుష్‌లో లంకేశ్ (రావణుడు)గా నటించాడు. ఇతడి లుక్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే! సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదాన్ని నేను బలంగా నమ్ముతాను. నన్ను నేను స్టార్ అని ఎన్నడూ ఫీలవలేదు. నా పేరెంట్స్ పెద్ద స్టార్స్.. కానీ సింప్లిసిటీకే ఓటేసేవారు.
వాస్తవంలో బతకాలి..
నేను కూడా వాస్తవంలోనే బతకాలనుకున్నాను. ఓటముల గురించి భయపడిపోను. ఆదిపురుష్‌నే ఉదాహరణగా తీసుకుందాం. కొన్నిసార్లు రిస్కు చేయాలి.. ఓటమిని తీసుకోగలగాలి. జీవితమన్నాక అన్నీ ఉండాలి. ఓటమితో బాధపడి ముడుచుకుపోకూడదు. మనం మనవంతు ప్రయత్నించాం, దురదృష్టం కొద్దీ వర్కవుట్ కాలేదు. నెక్స్ట్ సినిమాకు చూసుకుందాంలే అని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి! నేను అదే చేశాను' అని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్..
Comments
Please login to add a commentAdd a comment