Adipurush Movie Announced Released Date - Sakshi
Sakshi News home page

Adipurush: ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ విడుదలయ్యేది ఎప్పుడంటే..?

Published Mon, Sep 27 2021 12:33 PM | Last Updated on Mon, Sep 27 2021 4:26 PM

Makers Announced Adipurush release Date - Sakshi

బాహుబలితో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు రెబల్‌ ​స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన చేస్తున్నవన్నీ పాన్‌ ఇండియా సినిమాలే. ఇప్పటికే రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధమ​య్యింది. ఈ స్టార్‌ ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’లో నటిస్తున్నాడు. కాగా ఆయన ‘ఆదిపురుష్‌’ సినిమాని వచ్చే ఏడాది ఆగస్ట్‌ 22న రిలీజ్‌ తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.

రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ నిర్మిస్తోంది. ఇందులో కృతి సనన్ ‘సీత’గా చేస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ‘రావణుడి’ పాత్రలో నటిస్తున్నాడు. అయితే గతేడాది ప్రకటించిన ఈ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మూవీ రిలీజ్‌పై ఎన్నో పుకార్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో విడుదల తేదిని ప్రకటించిన మేకర్స్‌ వాటికి బ్రేక్‌ వేసినట్టైంది. కాగా ఈ సినిమాని  తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement