Chandrayaan 3 Budget: సాధారణంగా రాకెట్ తయారీ అనగానే వేల కోట్లు ఖర్చు అనే మాట వినిపిస్తుంది. నాసా దగ్గర నుంచి ఇస్రో వరకు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఒప్పుకొంటారు. కరెక్ట్‌గా చెప్పాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది తప్పితే తగ్గే సమస్య ఉండదు. తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు 'చంద్రయాన్ 3' ప్రయోగం చేశారు. ఇది జాబిలి దిశగా ప్రయాణించే కక్ష‍్యలోకి చేరింది. అయితే దీని బడ్జెట్, 'ఆదిపురుష్' బడ్జెట్ కంటే తక్కువనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది.
(ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప‍్పుడే!)
ప్రయోగం సక్సెస్
బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. దీన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
బడ్జెట్ తక్కువే
సాధారణంగా ఉపగ్రహ ప్రయోగాలు వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నదని అందరూ భావిస్తారు. ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం 'ఆదిపురుష్' సినిమాకు అయిన దాని కన్నా తక్కువ బడ్జెట్‌తోనే 'చంద్రయాన్ 3'ని రూపొందించారట. ప్రభాస్ సినిమా కోసం నిర్మాతలు దాదాపు రూ.700 కోట్ల వరకు పెడితే.. 'చంద్రయాన్ 3' కోసం కేవలం రూ.615 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలుస్తోంది. మేం చెప్పిన దానిపై నమ్మకం కుదరకపోతే గూగుల్ లో ఓసారి సెర్చ్ చేయండి. మీకే క్లారిటీ వచ్చేస్తుంది.
Chandrayaan-3, India’s third lunar exploration mission takes off from Sriharikota,Andhra Pradesh.
— All India Radio News (@airnewsalerts) July 14, 2023
🚀LVM3 Launch Vehicle Mk III takes the Chandrayaan-3 spacecraft to Geo Transfer Orbit (GTO).
🌝#Chandrayaan3 consists of an indigenous propulsion module, lander module, and a rover… pic.twitter.com/pbhxmZO0Eq
(ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment