చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 జెండా పాతడంతో యావత్ భారతదేశం సంతోషంలో మునిగి తేలుతోంది. ఎవరూ అందుకోలేని ఘనతను మన దేశం సాధించడంతో జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలవుతున్నారు కూడా! ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతీసేలా ఫోటో షేర్ చేసిన ప్రకాశ్‌రాజ్‌ను నెటిజన్లు ఓ ఆటాడేసుకున్న సంగతి తెలిసిందే!
తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ట్విటర్‌లో షేర్ చేసిన ఫోటోపై సెటైర్లు వేస్తున్నారు. చంద్రుడిపై జెండా.. జెండాపై చంద్రుడు(పాక్ జాతీయ పతాకం).. రెండూ ఒకటి కాదు అంటూ ఓ మీమ్ షేర్ చేశాడు హరీశ్. ఇది చూసిన జనాలు మధ్యలో పాకిస్తాన్‌ను తేవడం అవసరమా? అసలు ఆ దేశంతో మనకు పోలికేంటి? అని కామెంట్లు చేస్తున్నారు. 'మనకంటే దిగువన ఉన్న వాళ్లతో కాదు, మనకంటే గొప్పగా ఉన్నవాళ్లతో పోల్చుకోవాలి', 'ఈ విమర్శలు పక్కనపెట్టి చంద్రయాన్ 3 విజయంలో పాలుపంచుకున్నవాళ్లను ప్రశంసించండి' అని చురకలంటిస్తున్నారు.
'మనం అందుకున్న విజయాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప పక్కదేశాన్ని వెక్కిరించకూడదు.. ఒక సెలబ్రిటీవైన నువ్వు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మనం తోపులు అని చెప్పుకోవడానికి ఎదుటివాళ్లను ఎందుకు తక్కువచేయడం?..', 'అయినా అమెరికా, చైనా వంటి దేశాలతో మనం పోటీపడాలి, పోల్చుకోవాలే.. అంతే కానీ పాక్ లాంటి దేశాలతో కాదు.. అసలు నువ్వు డైరెక్టర్ ఎలా అయ్యావో.. ఏంటో?' అని విమర్శిస్తున్నారు.
Haahhahaha mana janaala sense of humour 🙏🙏🙏🙏 pic.twitter.com/x0ZOlQWTgu
— Harish Shankar .S (@harish2you) August 23, 2023
Comments
Please login to add a commentAdd a comment