జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్ | Chandrayaan-3 Landed Successfully, Tollywood Actors Tweets - Sakshi
Sakshi News home page

Chandrayaan-3 -Tollywood: ప్రయోగం విజయవంతం.. సెలబ్రిటీలు ట్వీట్స్

Published Wed, Aug 23 2023 6:23 PM | Last Updated on Wed, Aug 23 2023 7:41 PM

Chandrayaan-3 Launch Success Tollywood Actors Tweets - Sakshi

ఇస్రో రికార్డు సృష్టించింది. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విక్రమ్‌ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్‌ భారత్‌ ఉత్కంఠంగా ఎదురు చూశారు. ల్యాండింగ్‌ సక్సెస్‌ కావడంతో మేరా భారత్ మహాన్ అంటున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 23న సాయంత్రం 6:04 గంటలకు.. దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 

జాబిల్లిపై అదీ దక్షిణ ధ్రువంపై కాలు మోపడంతో.. చంద్రయాన్‌3 ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటివరకు ఏ దేశం.. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు ల్యాండ్‌ కాలేదు. భారత్‌ ఆ ఘనత సాధించి చరిత్ర సృష్టిచింది. ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా వరస ట్వీట్స్ పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement