Prabhas Fan Cut His Hand With Beer Bottle- Sakshi
Sakshi News home page

Adipurush Movie: జై రెబల్‌ స్టార్‌ అంటూ బీరు బాటిల్‌తో చేయి కోసుకుని ఫోటోకు రక్తతిలకం

Jun 16 2023 3:14 PM | Updated on Jun 16 2023 4:03 PM

Prabhas Fan Cut His Hand With Beer Bottle, Video Viral - Sakshi

జై రెబల్‌ స్టార్‌ అంటూ ప్రభాస్‌ పోస్టర్‌ ముందు బీరు బాటిల్‌తో చేయి కోసుకున్నాడు. పదేపదే చేయిని కోసుకుంటూ ఆ రక్తంతో ప్రభాస్‌ నుదుటన తిలకం దిద్దాడు. అప్పటికీ

ఆదిపురుష్‌.. ఆదిపురుష్‌.. ‍మొన్నటి నుంచి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఒకటే జపం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. తీరా ఆ రోజు రానే వచ్చేసరికి ఆనందం పట్టలేకపోతున్నారు. నేడు(జూన్‌ 16న) ఆదిపురుష్‌ రిలీజవగా సినిమా అద్భుతం.. మహాద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ప్రభాస్‌ కటౌట్లు పెట్టి పూలదండలు వేసి, కొబ్బరికాయలు కొట్టి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుతున్నారు.

అభిమాన హీరో అంటే ఆ మాత్రం ఉండాలి.. కరెక్టే కానీ ఓ వ్యక్తి మాత్రం మరీ అతి చేశాడు. జై రెబల్‌ స్టార్‌ అంటూ ప్రభాస్‌ పోస్టర్‌ ముందు బీరు బాటిల్‌తో చేయి కోసుకున్నాడు. పదేపదే చేయిని కోసుకుంటూ ఆ రక్తంతో ప్రభాస్‌ నుదుటన తిలకం దిద్దాడు. అప్పటికీ ఆ బీరు బాటిల్‌ను పక్కన పడేయకుండా డ్యాన్స్‌ చేస్తూ పలుమార్లు చేయి కోసుకుంటూనే ఉన్నాడు. అక్కడున్నవాళ్లు అతడిని ఆపడం మానేసి ఈ తతంగాన్నంతా వీడియో తీయడం గమనార్హం.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు అభిమానిని తిట్టిపోస్తున్నారు. ఇప్పుడేమైనా ప్రభాస్‌ వచ్చి వాడికి ట్రీట్‌మెంట్‌ ఇస్తాడా? సినిమా చూశామా? ఎంజాయ్‌ చేశామా? అని ఉండాలి కానీ ఇదంతా ఏంట్రా? ఏం ఫ్యాన్స్‌రా మీరు.. అతడిని రెండు దెబ్బలు వేసి చేయి కోసుకోకుండా ఆపాల్సింది పోయి పైగా వీడియో తీస్తున్నారు.. కొంచెమైనా బుర్ర ఉందా? అని తిట్టిపోస్తున్నారు.

ఆదిపురుష్‌ సినిమా ఎలా ఉంది? రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement