'ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.. సాయం చేయండి' | Amitabh Bachchan wants police help for safety of fans | Sakshi
Sakshi News home page

'ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.. సాయం చేయండి'

Published Tue, Jul 7 2015 8:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.. సాయం చేయండి' - Sakshi

'ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.. సాయం చేయండి'

ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముంబయి పోలీసుల సాయం కోరారు. తన ఇంటి ముందు ప్రతి ఆదివారం గుమిగూడుతున్న అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నెట్టుకొంటూ వత్తిడికి లోనై ఇబ్బందులు పడుతున్నారని, వారిని సరిగా ఉంచేందుకు సహాయపడాలని విజ్ఞప్తి చేశారు.

ఓ ఆదివారం నాడు ఒక మహిళ ఆమె చిన్న పిల్లలు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభిమానం తెలుపుకునేందుకు గుంపుమధ్య చిన్న సందు దొరికినా అందులోంచి దూరిపోతూ అవస్థలు పడుతూ ప్రమాదాన్ని లెక్కచేయకుండా రావడం తాను చూశానని, ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పారు. మరో ఆదివారం వర్షం వచ్చి ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లినా మరో ఆదివారం నుంచి ఆ విషయం షరా మాములుగా తయారైందని, ఫ్యాన్స్కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టేందుకు సహాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement