ఐదేళ్ల తర్వాత ఒకేవేదికపై అమితాబ్, రాజ్‌ఠాక్రే | Amitabh Bachchan, Raj Thackeray to share stage after five years | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత ఒకేవేదికపై అమితాబ్, రాజ్‌ఠాక్రే

Published Tue, Dec 24 2013 1:22 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Amitabh Bachchan, Raj Thackeray to share stage after five years

ముంబై: చిత్ర కళాకారుల సంక్షేమం కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. ఐదేళ్ల తర్వాత వీళ్లు తొలిసారిగా కలిశారు. షణ్ముఖానంద్ హాల్‌లో సోమవారం జరిగిన మహారాష్ట్ర నవనిర్మాణ్ చిత్రపట్ సేన ఏడో వార్షికోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమితాబ్‌కు ఘనస్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు ప్రచారకర్తగా, భోజ్‌పురి సినిమాల్లో నటించినందుకు అమితాబ్‌పై రాజ్‌ఠాక్రే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement