ఓ టైలర్ తప్పుతో సినిమా సూపర్ హిట్!! | Big B's iconic look in 'Deewar' resulted from tailoring error | Sakshi
Sakshi News home page

ఓ టైలర్ తప్పుతో సినిమా సూపర్ హిట్!!

Published Thu, Jul 3 2014 12:48 PM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM

ఓ టైలర్ తప్పుతో సినిమా సూపర్ హిట్!! - Sakshi

ఓ టైలర్ తప్పుతో సినిమా సూపర్ హిట్!!

నీలిరంగు డెనిమ్ షర్టు.. ఖాకీ ప్యాంటు.. భుజం మీద వేలాడుతూ కనిపించే తాడు.. ఈ మూడింటితో అమితాబ్ బచ్చన్-కు ఎక్కడలేని యాంగ్రీ యంగ్మాన్ లుక్ వచ్చేసింది. చొక్కాను కింది భాగంలో రెండు బటన్లు విప్పి.. కింద ముడేసి మాంచి రఫ్గా బిగ్ బీ దీవార్ చిత్రంలో కనిపించడంతో అభిమానులు ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. కానీ.. వాస్తవానికి ఆ రఫ్ లుక్ మొత్తం టైలర్ చేసిన చిన్న పొరపాటు వల్లే వచ్చిందని అమితాబ్ బచ్చన్ ఇప్పుడు చెబుతున్నారు.

ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తాజాగా వెల్లడించారు. 1970ల మొదటి నాళ్లలో రాజకీయాల మీద యష్ చోప్రా సంధించిన అస్త్రమే దీవార్ చిత్రం. 1975లో వచ్చిన ఈ సినిమాలో అమితాబ్ తన చొక్కాను ఎందుకు ముడేసుకున్నారో తెలుసా? టైలర్ పొరపాటున ఆ చొక్కాను బాగా పొడవుగా కుట్టేశారు. మరీ అంత పొడవుగా ఉంటే బాగోదని కింద రెండు బటన్లు విప్పి, ముడేసుకుని.. భుజం మీద తాడు వేసుకున్నారట. అంతే, ఆ రెండింటితోన అమితాబ్కు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో అమితాబ్తో పాటు శశి కపూర్, నిరుపా రాయ్, పర్వీన్ బాబీ, నీతూసింగ్ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement