మళ్లీ హాలీవుడ్ తెరపై బిగ్‌బీ?
మళ్లీ హాలీవుడ్ తెరపై బిగ్‌బీ?
Published Mon, Dec 30 2013 12:13 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘ద గ్రేట్ గట్స్‌బి’ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ మరో రెండు హాలీవుడ్ చిత్రాల్లోనటించే అవకాశం ఉందని బాలీవుడ్‌లో ఓ పుకారు షికారు చేస్తోంది. హాలీవుడ్ దర్శకుడు గార్త్ డేవిస్ దర్శకత్వంలో బ్రాడ్‌పిట్, జానీ డెప్‌లు ఓ చిత్రం నిర్మించనున్నారని వినికిడి. గ్రెగరీ డేవిడ్ రాబర్ట్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ని ఓ ముఖ్య పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారట.
ఇది కాకుండా మరో నవలా చిత్రంలో కూడా అమితాబ్ నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ నవల రాసిన వికాస్ స్వరూప్ ‘సిక్స్ సస్పెక్ట్స్’ అనే మరో నవల రాశారు. ఈ నవల ఆధారంగా బిబిసి, స్టార్‌ఫీల్డ్ సంస్థలు ఓ చిత్రం నిర్మించనున్నాయని వినికిడి. అర్జెంటీనియన్ దర్శకుడు పాబ్లో ట్రపారో ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. ఇందులో ఓ కీలక పాత్రను అమితాబ్‌తో చేయించాలని దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారట! ఈ రెండు చిత్రాలు ఇంకా చర్చల దశలో ఉన్నాయని, ఇంకా అమితాబ్ అధికారంగా సైన్ చేయలేదని సమాచారం.
Advertisement
Advertisement