
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్‌గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్ నీల్ పొలిటికల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారని, ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ తాజా టాక్. మరి.. ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ పొలిటికల్ లీడర్‌గా చూపిస్తారా? మాఫియా డాన్‌గానా? అసలు విషయం తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment