
కరాచీ: సాధారణంగా షాపులు ప్రారంభోత్సవం అంటే సెలబ్రిటీలు, సినీ తారలు, రాజకీయ నేతలను పిలుస్తుంటారు. ఇక వాళ్లు కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి నిర్వాహకులు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఇదంతా ప్రతీ ఈవెంట్‌లో జరిగే తతంగమే. అయితే ఓ ఈవెంట్ నిర్వాహకులు చేసిన చిన్న పొరపాటు కారణంగా మంత్రి షాపు ఓపనింగ్‌ను కత్తితో గాక తన పళ్లతో కొరిక కట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే.. సెప్టెంబర్ 2 న, జైళ్ల శాఖ మంత్రి, పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫయాజ్-ఉల్-హసన్ చోహన్‌ను రావల్పిండి నియోజకవర్గంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాపు ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. షాపు ఓపనింగ్ అంటే రిబ్బన్ కటింగ్ కామన్ అనే విషయం తెలిసిందే. కార్యక్రమానికి వచ్చిన ఆయనకు రిబ్బన్ కట్ చేసేందుకు ఇచ్చిన కత్తెర సరిగా కట్ కాలేదు. అది తుప్పు పట్టిపోవడంతో మరో సారి కట్ చేయాలని ప్రయత్నించినా ఆ రిబ్బన్ అసలు కట్ చేయలేకపోయాడు. దీంతో చేసేందేం లేక ఆ మంత్రి తన పళ్లతో ఆ రిబ్బన్‌ను కట్ చేశాడు.ప్రస్తుతం ఆ వీడియోను ఫయాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది.
Ribbon cutting ceremony by Fayyaz ul Hsssan Chohan pic.twitter.com/lsaELc4WME
— Murtaza Ali Shah (@MurtazaViews) September 2, 2021