వైఎస్‌ జగన్‌ను కలిసిన  మాజీ ఎంపీ తనయుడు | Ex M.P son met Y.S.Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన  మాజీ ఎంపీ తనయుడు

Published Fri, May 17 2019 11:00 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

Ex M.P son met Y.S.Jagan - Sakshi

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో దరూరు రమేశ్‌బాబు

సాక్షి, వజ్రకరూరు:  పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని  గురువారం ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కుమారుడు దరూరు రమేష్‌బాబు వందలాది మంది అనుచరులు, అభిమానులతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా దరూరు రమేష్‌బాబును వైఎస్‌.జగన్‌ ఆప్యాయంగా పలకరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్‌ సరళి, పార్టీ పరిస్థితి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ.వీరన్న, వజ్రకరూరు మండల అధ్యక్షుడు జయేంద్రరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు వడ్డె మహేష్, మాజీ ఎంపీపీ నాగేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకులు కమలపాడు వెంకటరెడ్డి, కొనకొండ్ల సంజప్ప తదితరులు  వైఎస్‌.జగన్‌ను కలిశారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని వైఎస్‌ జగన్‌ వారికి సూచించారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement