సాక్షి, మేడ్చల్: మండల రాజకీయ హెడ్ క్వార్టర్‌గా ఆ గ్రామం నిలిచింది. దశాబ్దాల నుంచి లీడర్లను అందిస్తున్న మెషినరీగా ఈ గ్రామం నిలవడం విశేషం. మొదటి నుంచి రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన గౌడవెళ్ళి తాజాగా మూడు ప్రధాన పార్టీల మండల అధ్యక్షులను అందివ్వడంతో మరోసారి ఆ గ్రామం పేరు మండలంలో చర్చనీయాంశంగా మారింది.
చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
గ్రామంలో ఘనమైన రాజకీయ చరిత్ర
గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్ర సమరయోధుడు సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పని చేశారు. ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి ఉమాదేవి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశారు.
► గ్రామానికి చెందిన సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా, పీసీసీ సీనీయర్ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు.
►గ్రామానికి చెందిన దయానంద్‌యాదవ్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా, నరేందర్‌రెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడిగా, రమణారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.
► ఇదే గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచిన పద్మజగన్‌రెడ్డి ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్నారు. గ్రామానికి చెందిన రణదీప్‌రెడ్డి డైరక్టర్‌గా ఎన్నికై మేడ్చల్ సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి!
► మూడు ప్రధాన పార్టీ అధ్యక్షులు, మండల పరిషత్ అ«ధ్యక్షురాలు గౌడవెళ్ళి వారే కావడంతో మండల రాజకీయం గౌడవెళ్ళి చుట్టూ తిరుగుతోంది. అందరూ 50 ఏళ్ల వయస్సులోపు వారు కావడంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మండల రాజకీయాన్ని రంజుగా నడిపిస్తున్నారు.
►రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న సురేందర్ ముదిరాజ్ ఈ గ్రామ సర్పంచే.
►జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రంరెడ్డి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అమరం మోహన్‌రెడ్డి, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు సరస్వతీ గుండ్లపోచంపల్లికి చెందిన వారే.
►మండలంలో అధికంగా రాజకీయం గుండ్లపోచంపల్లి, గౌడవెళ్ళి చుట్టు ఉండటంతో ఇతర గ్రామాల నాయకుల అసహనం కనిపిస్తున్నా చైతన్యం ఎక్కువగా ఉండటంతో నాయకులు గౌడవెళ్ళి నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment