
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ సీనియర్ నే త, ఉమ్మడి ఏపీ గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ బండి నర్సాగౌడ్ (65) సోమవారం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేటకి చెందిన నర్సాగౌడ్.. కాంగ్రెస్‌లో అంచలంచెలుగా రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదిగారు. గౌడ కమ్యూనిటీ ఐక్యతకు∙జీవితాంతం శ్రమించారు. గీత పా రిశ్రామిక సంస్థ చైర్మన్‌గా, ఉమ్మడి ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1998లో దొమ్మాట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. నర్సాగౌడ్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామం పోతారెడ్డిపేటలో నిర్వహించారు. నర్సాగౌడ్‌కు భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతాపం: నర్సాగౌడ్ మృ తిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పార్టీలో ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment