
శంషాబాద్ : కొత్వాల్‌గూడ గ్రామస్తులకు ఎనిమీ ప్రాపర్టీ సమస్య నుంచి విముక్తి కలిగించాలంటూ మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యతో గత మూడు నెలలుగా భూముల మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ నిలిపివేశారని తెలిపారు. సుమారు 80 ఏళ్లుగా సాగుపైనే ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. గ్రామస్తుల భూముల వివరాలను సేకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు వివరించినట్లు గ్రామ సర్పంచ్ గుర్రంపల్లి ప్రసన్నలింగం తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ పత్తి నర్సింగ్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తీక్‌రెడ్డి, వేణుగౌడ్, గుర్రంపల్లి లింగంయాదవ్, మాజీ ఉపసర్పంచ్ శేఖర్‌గుప్త, గుంటి మిట్టు, శంకర్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment