సంజన.. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా వయ్యారాలు పోయిన ఈ భామ.. కన్నడలో బిజీ నటిగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులను అడపాదడపా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే ఓ ఇంటిదయ్యింది. అలాగని ఇల్లాలయిపోయిందని
ఫిక్సయిపోకండి. ఓ అందమైన ఫ్లాట్‌కు ఓనర్ అయిందట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సంజన తన మూవీ ముచ్చట్లు, కొత్తింటి అచ్చట్లు సీటీప్లస్‌తో పంచుకుంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..
- శిరీష చల్లపల్లి
మాది బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌గా కనిపించాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. సినిమాల్లోకి రాకముందు జాన్ అబ్రహంతో ఫాస్ట్‌ట్రాక్ గ్లాసెస్ యాడ్‌లో నటించాను. ఆ యాడ్ చూసి పూరి జగన్నాథ్ నన్ను పిలిపించారు. తను తీయబోయే ‘బుజ్జిగాడు’లో మంచి రోల్ ఉందని చెప్పారు. అందులో ‘త్రిష చెల్లిగా నువ్వయితేనే కరెక్ట’ని ఆఫర్ చేశారు. వెంటనే ఓకే చెప్పేశాను. అప్పుడు నా ఏజ్ జస్ట్ సెవెంటీన్. ఆ సినిమా కోసమే నేను మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. అప్పటికీ నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. పూరి గారు నాకు కొత్త లోకాన్ని పరిచయం చేశారు. ఇంకా చెప్పాలంటే నాకో కొత్త లైఫ్ అందించారు. అంతకుముందు తమిళం, కన్నడంలో కొన్ని సినిమాలు చేసినా.. బుజ్జిగాడు మంచి బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్‌లో సక్సెస్ తర్వాత శాండిల్‌వుడ్‌లో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రజెంట్ కన్నడలో ప్రధాన నటి కావడానికి కారణం టాలీవుడే.
మై డ్రీమ్ హోమ్..
ఈవెంట్స్, ఇనాగరేషన్స్, మూవీస్.. ప్రస్తుతం బిజీగానే ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్నీ ఫాలో అవుతున్నాను. అందుకే బెంగళూరూలో ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాను. ఈ మధ్యే అందులోకి వెళ్లాం. చిన్నప్పటి నుంచి నాకో డ్రీమ్ హోమ్ ఉండేది. న్యూ ఫ్లాట్‌లో కూడా ఫర్నిచర్, ఆర్కిటెక్చర్.. ఇలా ప్రతిదీ నా ఊహాసౌధాన్ని మరపించేలా ప్లాన్ చేసుకున్నాను. నేను రోజూ వెళ్లే యోగా సెంటర్, జిమ్ సెంటర్ కూడా మా ఇంటికి చాలా దగ్గర. ప్రజెంట్ నా డ్రీమ్ హోమ్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నాను.
షాపింగ్స్.. హ్యాంగౌట్స్.
పేరుకు బెంగళూరువాసినైనా.. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. తర చూ ఈ సిటీ విజిట్ చేస్తుంటాను. వచ్చిన ప్రతిసారీ కనీసం రెండుమూడ్రోజులు స్టే చేస్తాను. ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా షాపింగ్, హ్యాంగౌట్స్‌కి వెళ్తుంటాను. ప్రస్తుతం కన్నడలో 5 సినిమాలు చేస్తున్నాను. తెలుగులో అవును-2 సినిమాలో నటిస్తున్నాను.
ఆ క్రెడిట్ టాలీవుడ్‌దే..
Published Tue, Mar 10 2015 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement