టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోవాలో బుమ్రా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా నుంచి పలువురు ఆటగాళ్లు సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే నటి అనుపమా పరమేశ్వరన్ మాత్రం బుమ్రా పెళ్లిపై హర్ట్ అయినట్లు ఉంది. దీంతో తన బాధను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంటూ..'నా నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే ముక్కలైపోయిన నా గుండె నీకు గుచ్చుకొని నొప్పి పెట్టవచ్చు..
అయినా గాయం నయం కావోచ్చేమో గానీ వాటి తాలూకూ మచ్చలు అలాగే ఉండిపోతాయి' అంటూ అనుపమా రెండు రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో అనుపమ మనసను గాయం చేసింది బుమ్రానే అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఓ మలయాళం స్యాడ్ సాంగ్‌ని కూడా షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలో పాపం అనుపమా.. అంటూ కొందరు ఆమెను ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు నుంచి తప్పుకొన్న బుమ్రా పెళ్లాడబోతుంది హీరోయిన్ అనుపమా పరమేశ్వర్‌నే అంటూ పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. గతంలో బుమ్రా తన ఫేవరెట్ క్రికెటర్ అని అనుపమ ప్రకటించడం, ఇటీవల అతడి స్వస్థలం గుజరాత్‌ను ఆమె సందర్శించిన ఫొటోలు షేర్ చేయడంతో ఈ మేరకు వదంతులు ప్రచారమయ్యాయి. అయితే వారిద్దరి పెళ్లిపై వస్తున్న వార్తలను అనుపమ తల్లి కొట్టిపారేశారు. వారిద్దరి కేవలం స్నేహితులు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్‌ను బుమ్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య బుమ్రా గోవాలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
చదవండి : (బుమ్రా-సంజూ హనీమూన్; మాల్దీవ్స్ అయితే బెటర్)
(అయ్యో మయాంక్.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్ చేసి)
Comments
Please login to add a commentAdd a comment