భార్య సంజనా ఫోటోకు బుమ్రా రియాక్షన్‌ | IPL 2021: Bumrah Reacts To Sanjana Ganesans Instagram Post | Sakshi
Sakshi News home page

భార్య సంజనా ఫోటోకు బుమ్రా రియాక్షన్‌

Published Fri, Apr 23 2021 4:35 PM | Last Updated on Fri, Apr 23 2021 6:56 PM

IPL 2021: Bumrah Reacts To Sanjana Ganesans Instagram Post - Sakshi

ముంబై: గత నెల 14వ తేదీన గోవాలో స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్‌- టీమిండియా పేసర్‌ బుమ్రాలు  అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానుల్ని పలకరిస్తూనే ఉన్నారు. తమ ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ వారి అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు. ఇటీవల సంజనాతోపెళ్లి జరిగి నెల అయిన సందర్భంగా సెలబ్రేట్‌ చేసుకున్న విషయాన్ని బుమ్రా తన ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా స్పష్టం చేశాడు. ఒక నెల ప్రేమలో ఎన్నో జ్ఙాపకాలు  అంటూ ట్వీటర్‌ లో షేర్‌ చేశాడు. ‘కడుపుబ్బా నవ్వులు.. సిల్లీ జోక్స్‌,  సుదీర్ఘమైన చర‍్చలు.. శాంతి’ అంటూ రాసుకొచ్చాడు.

తాజాగా బుమ్రా-సంజనాల మరొకసారి సోషల్‌ మీడియా ద్వారా అభిమానుల్ని పలకరించారు.  బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో సంజనా ఒక పోస్ట్‌ చేశారు. తను రీసెంట్‌ తీసుకున్న ఫోటోను షేర్‌ చేశారు. దానికి ‘ఒక మంచి లైట్‌. గ్రేట్‌ ఫోటో’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. దీనికి రెండు హృదయాల ఎమిటికాన్స్‌ జత చేసి తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు బుమ్రా. పెళ్లి తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న ఈ జంట.. మళ్లీ తమ విధుల్లో బిజిబిజీగా ఉన్నారు.  స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ అయిన సంజన.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)ను కవర్‌ చేస్తుండగా,  ఆ లీగ్‌ ముంబై ఇండియన్స్‌ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు బుమ్రా.  గతేడాది జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలవగా అందులో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ లీగ్‌లో బుమ్రా 27 వికెట్లు సాధించి ముంబై తరఫున అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్‌గా నిలిచాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement