డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్‌ హీరోయిన్.. ఎవరో తెలుసా? | Another Women Director Entry In Tollywood Movie industry | Sakshi
Sakshi News home page

Director: మెగా ఫోన్ పట్టనున్న టాలీవుడ్‌ నటి.. ఇంతకీ ఆమె ఎవరంటే?

Published Mon, Feb 19 2024 9:45 PM | Last Updated on Mon, Feb 19 2024 9:54 PM

Another Women Director Entry In Tollywood Movie industry - Sakshi

సినీ ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత  సావిత్రి .. ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడిప్పుడే  మహిళా డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు.

అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి మంచి దర్శకురాలిగా గుర్తింపు సాధించారు. అలాగే 2021లో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య... ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్‌గా రాణించారు. 

తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన  సంజన అన్నే కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు .కాగా.. సంజన అన్నే గతంలో నేనే రాజు నేనే మంత్రి, నీకు నాకు పెళ్లంట టామ్ టామ్ లాంటి చిత్రాల్లో నటించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement