
న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ వివాహానికి సంబంధించిన విశేషాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ జంట సోమవారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆది నుంచి తమ బంధం గురించి ఎక్కడా బయటపడని ఈ సెలబ్రిటీ కపుల్.. ఏకంగా పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురైనా, కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ హల్‌చల్ చేస్తున్నారు. వీరి పరిణయానికి సంబంధించిన ఏ చిన్న వీడియో దొరికినా తమ ఖాతాల్లో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా , బుమ్రా- సంజూ తమ సంగీత్‌లో డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇద్దరూ కలిసి తన్మయత్వంతో స్టెప్పులేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వీడియో కన్నుల పండుగా ఉందంటూ యార్కర్ కింగ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక బుమ్రా ప్రాతినిథ్యం వహిస్త్ను ముంబై ఇండియన్స్ సైతం వీరి వెడ్డింగ్‌లోని మధుర జ్ఞాపకాలకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. కాగా పుణెకు చెందిన సంజనా గణేశన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను గెలుచుకున్నారు. అదే విధంగా, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా అవతారమెత్తిన సంజన, బుమ్రాను ప్రేమించి, ఇరు కుటుంబాల సమక్షంలో అతడిని పెళ్లాడారు.
ఫొటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చదవండి: బుమ్రానే బౌల్డ్ చేసింది.. ఎవరీ సంజన?!
అయ్యో మయాంక్.. బుమ్రా భార్యను తప్పుగా ట్యాగ్ చేసి
And one moreeee here... 💐🎉🍾👸🤴🥳... Adorable 👀👀...#yorkerking#bumrahthegoat#JaspritBumrah#IndianCricketTeam#TeamIndia#MumbaiIndians#icc#bcci#INDvsENG#bumrahwedding#jaspritbumrahmarriage#jaspritbumrahwedding@Jaspritbumrah93@SanjanaGanesan pic.twitter.com/cOttQnPWeh
— Jasprit bumrah.fc (@bumrahthegoat) March 16, 2021
Comments
Please login to add a commentAdd a comment