
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. ఆలిండియా టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ముంబైలో జరుగుతోన్న ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సంజన క్వార్టర్స్‌కు చేరింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సంజన 6–3, 6–3తో పదో సీడ్ రీని సింగ్లా (హరియాణా)పై అద్భుత విజయాన్ని అందుకుంది.
అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో 6–2, 6–0తో అమీక్ బట్ (ఒడిశా)పై, రెండో రౌండ్‌లో 4–6, 6–0, 6–2తో ఆరోసీడ్ బేలా టంహాంకర్ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. ఈ టోర్నీలో రాష్ట్రం నుంచి 15 మంది క్రీడాకారులు బరిలోకి దిగగా... సంజన మినహా మిగతా వారంతా విఫలమయ్యారు.