
హీరోయిన్ సంజన వీడియో లీక్!
బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ సోదరిగా నటించిన సంజన ...పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా అనుకున్నంతగా ఆమెకు గుర్తింపు రాలేదు.
బెంగళూరు : బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ సోదరిగా నటించిన సంజన ...పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా అనుకున్నంతగా ఆమెకు గుర్తింపు రాలేదు. దీంతో ఆమె తన సొంతగడ్డపై దృష్టి సారించింది. అయితే ఒక్కసారిగా హీరోయిన్ సంజన సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. బందిపోటు దొంగల ఇతివృత్తంతో కన్నడ సినిమా ‘దండుపాళ్యం 2’ లో ఆమెపై పూర్తిగా నగ్నంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. కాగా సెన్సార్ బోర్డు ఆ సీన్స్‌ను కట్ చేసినప్పటికీ, కొన్ని దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
దండుపాళ్యం పేరు వింటే చాలు అతి భయంకరమైన దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు దానికి సీక్వెల్ గా దండుపాళ్యం-2 తెరకెక్కింది. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా శాండిల్‌వుడ్‌లో భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుని, హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా శుక్రవారం (జూలై 21న) తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా సంజన దండుపాళ్యం ముఠాలో సభ్యురాలిగా నటించింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణలో భాగంగా సంజన దుస్తులు తొలగించి చిత్రహింసలు పెట్టే దృశ్యాలు ఆ వీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌రాజు మాత్రం ...ఆ వీడియో రియల్ కాదని, అసలా దృశ్యాలు సినిమాలోనే లేవని తెలిపారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న నటి సంజన కాదని తెలిపారు. అయితే ఈ వీడియో లీక్ వ్యవహారంపై సంజన మాత్రం పెదవి విప్పలేదు.