
ఆ రోజు ఏం జరిగింది?
సంజన ప్రధాన పాత్రలో శ్రీనందన్ మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. శ్రీధర్, జ్యోతీసేథీ, శ్రవణ్ ఇతర ముఖ్య పాత్రలు
సంజన ప్రధాన పాత్రలో శ్రీనందన్ మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’. శ్రీధర్, జ్యోతీసేథీ, శ్రవణ్ ఇతర ముఖ్య పాత్రలు చేశారు. పల్లెల వీరారెడ్డి దర్శకత్వం వహించారు. సంతోష్ రెడ్డి స్వరపరచిన ఈ చిత్రం పాటల విడుదల వేడుకలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ గువ్వల బాలరాజు, దర్శకుడు బి.గోపాల్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో సీడీని మేయర్ బొంతు రామ్మోహన్ విడుదల చేశారు.
‘‘మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకుంటారని భావిస్తున్నాం’’ అని నటుడు శ్రీధర్ అన్నారు. ‘‘యథార్థ సంఘటన ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఓ ఇంట్లో రాత్రి పుట్టినరోజు జరుపుకున్న జంటకు ఎదురైన సంఘటనలతో రూపొందించాం’’ అని దర్శకుడు తెలిపారు. ‘‘కథా కథనం ఆసక్తికరంగా ఉంటాయి’’ అని నిర్మాత మహేశ్ కల్లె అన్నారు.