Jasprita Bumrah And Sanjana Ganesan Marriage Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

తనే నా ప్రపంచం: బుమ్రా, సంజన పెళ్లి వీడియో వైరల్‌

Published Tue, Mar 23 2021 4:59 PM | Last Updated on Tue, Mar 23 2021 7:06 PM

Jasprit Bumrah, Sanjana Ganesan Wedding Video Floors Netizens - Sakshi

అనేక ఊహాగానాలకు తెరదించుతూ టీమిండియా స్టార్ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, టీవీ ప్రెజెంటర్‌ సంజన గణేషన్‌ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మార్చి 15న జరిగిన ఈ వేడుకకు గోవా వేదికగా మారింది. ‘మా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు. మా పెళ్లి వార్తను, ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం’  అంటూ బుమ్రా ట్వీట్‌ చేశాడు. బుమ్రా, సంజనల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా వీరి వివాహానికి చెందిన ఓ వీడియో సోషల్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

దీనిని మంగళవారం వెడ్డింగ్‌ ఫిల్మర్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ పోస్టు చేసింది. ‘‘నువ్వు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్‌ అని నేను అడిగాను. దానికి ‘ఎందుకంటే ఇప్పుడు తనే నా ప్రపంచం’ అని అతను బదులిచ్చాడు.’’అనే క్యాషన్‌తో షేర్‌ చేశారు.ఈ వీడియోలో పెళ్లికూతురుగా ముస్తాబైన సంజనను తన తండ్రి మండపం వద్దకు తీసుకు రావడంతో మొదలైన ఈ వీడియోలో వధూవరూలిద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. పెళ్లి దండలు మార్చుకుంటూ బుమ్రా, సంజన ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మీ జంట చూడముచ్చటగా ఉందంటూ మరోసారి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చదవండి: 

సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్‌ అయిన అనుపమ

బుమ్రా పెళ్లి వేడుకల ఫోటోలు.. కొత్త తలనొప్పులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement