
'నా కూతురు విషయంలో న్యాయం జరగలేదు'
హైదరాబాద్: పెద్దఅంబర్ పేట వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీదేవి, సంజనలను చిన్నారి రమ్య వెంకటరమణ పరామర్శించారు. కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన కూతురు విషయంలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చట్టాలు తేవాలని ఆయన డిమాండ్ చేశారు.
జులై 1న కొంతమంది యువకులు మద్యం మత్తులో కారు నడిపి బంజారాహిల్స్ లో ఎనిమిదేళ్ల చిన్నారి రమ్యతో పాటు ఆమె తాత, బాబాయ్‌ల మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న నిందితుడు శ్రావిల్‌కు హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.