
సాక్షి,ముంబై: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజన గణేశన్ పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైన ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు అంతకంటే లవింగ్ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘‘ప్రతి రోజు నా మనసు దోచుకునే నా ప్రాణమా...నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు...ఐ లవ్ యూ’’ అంటూ బుమ్రా 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన హృదయరాణికి విషెస్ తెలిపాడు. ఐపీఎల్ 2021 రద్దు కావడంతో ఈ ప్రేమ పక్షులకు కలిసి వచ్చిందంటూ ఫెండ్స్, ఇతర అభిమానులు కామెంట్స్ చేశారు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బుమ్రా, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అనేక ఊగాహానాలతో బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో కొన్ని రోజులు ట్రెండింగ్‌లో నిలిచింది. చివరికి మార్చి 14న గోవాలో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఏకమై పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment