ఇక్బాల్, సంజనలకు టైటిల్స్ | iqbal, sanjana clinch championship series tennis titles | Sakshi
Sakshi News home page

ఇక్బాల్, సంజనలకు టైటిల్స్

Published Thu, Oct 27 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

iqbal, sanjana clinch championship series tennis titles

సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సంజన, ఇక్బాల్ విజేతలుగా నిలిచారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఇక్బాల్ మొహమ్మద్ ఖాన్ (తెలంగాణ) 6-3, 6-3తో అద్వైత్ అగర్వాల్(మహారాష్ట్ర)పై గెలుపొందగా, బాలి కల ఫైనల్లో సంజన (తెలంగాణ) 6-4, 6-3తో మృదుల పళనివేల్ (తమిళనాడు)పై నెగ్గింది.

 

బాలుర డబుల్స్‌లో అద్వైత్ అగర్వాల్ (మహారాష్ట్ర)- యశోధన్ నక్రే (తెలంగాణ) ద్వయం 7-2తో తారకేశ్ అశోకన్ - నితిన్ అదిత్ (తమిళనాడు) జంటపై గెలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అమూల్య - ఆర్ని రెడ్డి (తెలంగాణ) ద్వయం 7-4తో మృదుల- రితిక (తమిళనాడు) జోడీపై నెగ్గి టైటిల్‌ను దక్కించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement