
సాక్షి, హైదరాబాద్: ఆసియా టెన్నిస్ అండర్–14 చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జరిగిన ఈ టోర్నీలో 13 ఏళ్ల సంజన చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల తుది పోరులో సంజన 6–2, 6–2తో కుంకుమ్ నీల (తెలంగాణ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో సంజన 6–1, 4–6, 6–0తో హిత్వీ చౌదరి (గుజరాత్)పై గెలుపొందింది.