'హి' చిత్రం విజయం సాధించాలి: మంత్రి హరీశ్‌ రావు | Minister Harish Rao Released The Movie Title Poster | Sakshi
Sakshi News home page

'హి' చిత్రం విజయం సాధించాలి: మంత్రి హరీశ్‌ రావు

Published Tue, Oct 31 2023 11:19 AM | Last Updated on Tue, Oct 31 2023 11:19 AM

Minister Harish Rao Released The Movie Title Poster - Sakshi

బిగ్‌బాస్‌ ఫేమ్‌ సంజన అన్నే ప్రధాన పాత్రలో నటించిన నటించిన తాజా చిత్రం ‘ హి (హంట్స్ ఎవ్రివన్)’. అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్  ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్  నిర్మించారు.తాజాగా ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ..  కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హి' చిత్రం అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  ‘‘హి’లో హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం’అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement